ఈసారి అంతా అబ్బాయిలదే హవా..!

-

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యార్థులందరూ ఎంసెట్ పరీక్ష రాసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాధి నేపథ్యంలో వివిధ నిబంధనల మధ్య విద్యార్థులందరూ ఎంసెట్ పరీక్ష రాశారు. ఇక ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా విద్యార్థుల నిరీక్షణ నేటితో తీరిపోయింది. ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

మామూలుగా అయితే ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయినప్పుడు ఎక్కువగా అమ్మాయిల మంచి ర్యాంకులు సాధిస్తు ఉంటారు కానీ ఈ సారి మాత్రం ఎంసెట్ ఫలితాల్లో అబ్బాయిలు హవా నడిపించారు. 75.29 శాతం మంది విద్యార్థులు అర్హత మార్కులు సాధించారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయగా… మొదటి పది ర్యాంకులు అబ్బాయిలు సొంతం చేసుకున్నారు. వారణాసి సాయి తేజ కు మొదటి ర్యాంకు.. యశ్వంత్ కి రెండవ ర్యాంకు… వెంకట కృష్ణ కు మూడవ ర్యాంకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news