తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డెయిరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీ గా పేరు పొందిన దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణ లో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు రూ.500 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది. బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన అమూల్ ప్రతినిధి బృందం.. ఈ మేరకు ప్రభుత్వం తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో.. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో.. పాటు అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళుతున్నారని.. ఈ దిశగా వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఇలాంటి కంపెనీలు మరిన్ని వచ్చేందుకు.. అన్ని రకాల సౌలభ్యాలు అందిస్తున్నట్లు చెప్పారు.