చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగక సతమతమవుతూ ఉంటారు. మనం నివసించే ప్రదేశంలో లక్ష్మీదేవి లేకపోతే పేదరికం ఉంటుంది అయితే అలా కాకుండా మన ఇంట్లోకి లక్ష్మీ దేవి రావాలన్నా, పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను పాటిస్తే మంచిది. చాలామంది తరచూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అయితే ఆర్థిక సమస్యలు కలగకుండా ఉండాలంటే రాత్రిపూట ఈ పద్ధతులను పాటిస్తే మంచిది.

ఇలా కనుక ఇళ్లల్లో అనుసరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించుకోవచ్చు. కుటుంబాల మధ్య సంబంధాలు కూడా మంచిగా ఏర్పడతాయి. స్త్రీలు నిద్రపోయే ముందు ఆవనూనెను ఇంటికి దక్షిణదిక్కున కొంత రాయాలి. ఈ విధంగా పాటించడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయి. అలానే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది.
అలానే రాత్రి పూట దీపాన్ని కానీ బలుపుని కాని ఉంచాలి. రాత్రి పడుకునే ముందు ఇల్లు చిందరవందరగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. కానీ చాలా మంది రాత్రి తినేసిన సామాన్లుని అలా వదిలేసి ఉంచేస్తారు. దానివల్ల ధనలక్ష్మి ఇంట్లోకి రాదు.
నెగిటివ్ ప్రభావం పడుతుంది. అలానే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి రాత్రిపూట కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంట్లో పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రుల్ని అత్తమామల్ని గౌరవిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. అలానే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది.