రైతులకు మరో శుభవార్త. పాడి రైతులకు అమూల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పాల సేకరణ ధరను పెంచింది. లీటర్ కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవు పాలపై లీటరు కు గరిష్టంగా రూ.3.08 పెంచింది.
కిలో వెన్నపై రూ.30, ఇతర పాల సంబంధిత ఘన పదార్థాలపై రూ.22 మేర ధర పెంచింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల పరిధిలో నేటి నుంచి పెంచిన ధర వర్తిస్తుందని అమూల్ సంస్థ ప్రకటించింది. తాజా నిర్ణయంతో 2.29 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాడి రైతులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.