హిండెన్‌బర్గ్‌ను గట్టి దెబ్బ కొట్టేలా.. పక్కా ప్లాన్‌తో అదానీ..!

-

భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై న్యాయపోరాటానికి సిద్ధం అవుతోంది. అందుకు వాచ్‌టెల్ సంస్థను నియమించుకున్నారు. అమెరికాలో న్యాయరంగంలో గొప్ప పేరు వున్న సంస్థ ఇది. అమెరికా కార్పొరేట్ చట్టాలు, భారీ లావాదేవీల నిర్వహణలోనూ ఈ సంస్థ కి బాగా పట్టుంది. ఎన్నో కంపెనీలు సమస్యలు వచ్చినప్పుడు ఈ వాచ్‌టెల్‌నే పెట్టుకునే వాళ్ళు.

దశాబ్దాల చరిత్ర కలిగుంది దీనికి. ఇదిలా ఉంటే న్యూయార్క్‌ కి చెందిన వాచ్‌టెల్, లిప్టన్, రోసెన్, కాట్జ్ సీనియర్ లాయర్లను అదానీ గ్రూప్ సంప్రదించడం జరిగింది. అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ చేస్తున్నట్లు హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణ నుండి బయట పడాలని చూస్తోందని కొందరు చెప్పినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ అంది.

రూ.20 వేల కోట్ల నిధులు సమీకరించడమే ముందు రోజు జనవరి 25న అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణ చేసింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలు చేస్తోందని చెప్పింది. అలానే స్టాక్ మానిపులేషన్‌కు పాల్పడుతోందని ఓ రిపోర్ట్ ని విడుదల చేసింది.

కానీ మొదట అదానీ గ్రూప్ తేలికగా తీసేసినా.. ఎఫ్‌‌పీఓను రద్దు చేసుకుంటున్నట్లు తరవాత ప్రకటించింది. గ్రూప్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా పతనమైంది. ఆదాయాన్ని ప్రాపర్టీ కూడా పడిపోయింది. రూ.5 లక్షల కోట్ల మేరకోల్పోయారు. అలానే అదానీ స్టాక్స్ పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్ కూడా కష్టాల్లోనే వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news