సినీరంగం వాళ్లకు తాగి నడపడం బాలా అలవాటయిపోయింది. రాజశేఖర్ బెంజ్ ఎస్‌యువీలో మద్యం సీసాలు లభించాయి. రాజశేఖర్‌తో పాటు ఇంకో ఇద్దరున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
నిన్నరాత్రి ప్రమాదానికి గురైన సినీనటుడు రాజశేఖర్ కారులో మద్యం బాటిళ్లు లభించడం సంచలనం రేపింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఆక్సిడెంట్‌లో ఎవరికీ పెద్దగా దెబ్బలు తగల్లేదు. బెలూస్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కారులో రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడో శివార్లలోని ఫాంహౌస్‌లో జరిగిన లేట్‌నైట్ పార్టీకి హాజరైన రాజశేఖర్, మద్యం సేవించి, తనే కారు నడుపుతూ ఔటర్ ఎక్కినట్లుగా తెలసుస్తోంది. సువిశాలమైన రోడ్డు కావడంతో విపరీతమైన వేగంతో కారు నడిపిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఓఆర్‌ఆర్ మీద ఉన్న కెమెరాలు, స్పీడ్‌గన్స్‌ను పరిశీలించాలని నిర్ణయించిన పోలీసులు కారు ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు గంటకు 180 కిమీల వేగంతో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
రాజశేఖర్ భార్య జీవిత యథాప్రకారం, భర్తను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఒక విడియోను విడుదల చేసారు. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నుండి వస్తుండగా, టైర్ బ్లాస్ట్ అయి, కార్ నియంత్రణ కోల్పోయిందనీ, అటువైపుగా వస్తున్నవారు చూసి తమకు ఫోన్ చేయగా తాము ఎదురెళ్లి రాజశేఖర్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ఇదే రాజశేఖర్, ఇంతకుముందు కూడా ప్రమాదానికి గురయ్యాడు.
గతంలో నటుడు రవితేజ తమ్ముడు భరత్ కూడా 2017 జూన్‌లో ఇదే ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురై మరణించాడు. ఇవన్నీ కూడా మద్యం సేవించి కారు నడపడం వల్ల అయిన ప్రమాదాలే. సహజంగా సినీరంగంలో ఉండే పార్టీ కల్చర్, జల్సాలు చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బందిపెట్టాయి. అయినా, వీటిని పట్టించుకునే నాథుడే లేడు ఇండస్ట్రీలో. కొంతమంది పెద్ద కుటుంబసభ్యులు మాత్రం ఇటువంటి పార్టీలకు, ఈవెంట్‌లకు దూరంగా ఉండి తమ హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు. ఏదేమయినా, అన్ని రోజులు మనవి కావు. రోడ్ల మీద జాగ్రత్తగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా మద్యం సేవించిఉన్నప్పుడు వేరే డ్రైవర్ సహాయంతో వెళ్లడం అందరికీ మంచిది. ఒక్క క్షణం మనది కాకపోతే, కుటుంబసభ్యుల క్షోభ నరకాన్ని తలపిస్తుంది.