ఆనం రామనారాయణ రెడ్డి: ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా …

-

ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని ఈ మధ్యన వైసీపీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా రామనారాయణ రెడ్డి స్వయంగా ప్రకటించిన నిర్ణయం ప్రకారం వచ్చే ఎన్నికలలో ఏపీలో ఎమ్మెల్యే గా టీడీపీ నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ నియోజకవర్గం అన్న విషయంపై ఏమీ చెప్పకపోయినా నెల్లూరు జిల్లా నుండి అన్నది మాత్రమే ఖచ్చితం. అయితే నెల్లూరు జిల్లాలో కొన్ని రాజకీయ వర్గాలు ప్రచారం చేస్తున్న ప్రకారం ఎంపీగా పోటీ చేస్తారు అని, కానీ రామనారాయణ రెడ్డికి ఎంపీగా పోటీ చేయడంలో ఏ మాత్రం ఆసక్తి లేదట.

పైగా ఈయన చెప్పిన ప్రకారం వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుందన్నారు. ఈయన వరికుంటపాడు పర్యటనలో మాజీ ఏ ఎం సి చైర్మన్ నాగిరెడ్డి ఇంట్లో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news