టీమ్ వర్క్ పై ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్.. వీడియో వైరల్

-

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచు ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన పోస్టులు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా ఆయనను అనుసరించే కోటి మంది ఫాలోవర్లతో పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన టీం వర్క్ ఎలా ఉండాలో చెబుతూ ఓ వీడియోని షేర్ చేశారు.

- Advertisement -

ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ పక్షి ఇసుకను తోస్తూ గొయ్యి తవ్వుతుంటే.. మరొక పక్షి పైనుండి అదే ఇసుకను తిరిగి గోయిలోకి నెడుతూ ఉంటుంది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోని షేర్ చేస్తూ టీం వర్క్ అంటే ఇలా ఉండకూడదని చెప్పారు. ” కొన్ని సందర్భాలలో వారం మధ్యలో, ప్రాజెక్టు మధ్యలో మీరు ఇలా చేస్తున్నట్లు ఉంటుంది. కానీ మీరంతా ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారా అనేది నిర్ధారించుకోండి ” అని ఆనంద్ మహేంద్ర ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...