నా డ్రెస్ నా ఇష్టం… సుమ‌ను ఏకేసిన అన‌సూయ‌

-

హాట్ యాంక‌ర్ అన‌సూయ అటు తెలుగు బుల్లితెర‌తో పాటు వెండితెర మీద కూడా ప్రేక్ష‌కుల అభిరుచిని బ‌ట్టి క్యారెక్ట‌ర్ రోల్స్ చేస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. తాజాగా అన‌సూయ క‌థ‌నం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా అనుకున్న‌ట్టుగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. అనసూయ సోషల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

Anasuya Fire On Anchor Suma

తాజాగా ఆమె మోడ్ర‌న్ డ్రెస్‌లో వేసుకున్న ఫొటోలు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అన‌సూయ హాట్ ఫొటోల‌కు కామెంట్లు పెడుతూ ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. కామెంట్ల‌లో కొంద‌రు మ‌రీ ఘోరంగా ఆమెను ట్రోల్ చేస్తుండ‌డంతో ఇలాంటి పిచ్చి కామెంట్ల‌ను ప‌ట్టించుకోవ‌డం తాను ఎప్పుడో మానేశాన‌ని… త‌న డ్రెస్ స్టైల్ త‌న ఇష్టం అని తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

నార్త్ ఇండియ‌న్లు ఎక్స్‌పోజింగ్ చేస్తే… అబ్బో ఎంత అందంగా ఉందో అని పొగిడేస్తారు… కానీ తన‌పై మాత్రం ఇష్ట‌మొచ్చిన‌ట్టు విమ‌ర్శ‌లు చేస్తార‌ని వాపోయింది. న‌న్ను ఎందుకు టార్గెట్ చేయాల‌ని కూడా ఆమె ప్ర‌శ్నించింది. ఇక త‌న యాంక‌రింగ్ గురించి వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై కూడా ఆమె స్పందించింది. త‌న‌కు సుమ‌తో పోలిక పెట్ట‌డంతో ఆమె మ‌రింత‌గా రెచ్చిపోయింది.

Anasuya Fire On Anchor Suma

తాను, సుమ, ఝాన్సీ లాంటి యాంకర్స్ పెళ్ళైనవాళ్ళమే. ఎవరికి న‌చ్చిన‌ట్టుగా వాళ్లు ఉంటారు… ఎవ‌రికి న‌చ్చిన‌ట్టుగా వాళ్లు డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ల అనుభ‌వం ముందు త‌న అనుభ‌వం త‌క్కువే అయినా… ఒక‌ళ్ల‌ను చూసి నేర్చుకోవాల‌ని నాకు చెప్ప‌డం మానుకోవాల‌ని ఘాటుగా రిప్లై ఇచ్చింది.
సుమలా నేనెందుకు ఉండాలి.. ఆమెనే నాలాగా ఉండమని చెప్పొచ్చుగా అని బదులిచ్చింది. అక్క‌డితో ఆగ‌కుండా కాలాన్ని బ‌ట్టి ఎలా ఉండాలో ? ఎలా యాంక‌రింగ్ చేయాలో సుమ‌కే చెప్పొచ్చుగా అని కాస్త ఘాటుగానే మాట్లాడింది.

Read more RELATED
Recommended to you

Latest news