ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం వస్తుందో తెలుసా ?

ఇంట్లో శివార్చన చేసుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అయితే ఏ వస్తువు లేదా పదార్థంతో చేసిన శివలింగాన్ని అర్చించాలి అనేది పెద్ద సందేహం. దీనికి నిర్ణయసింధులో చెప్పిన శాస్త్ర ప్రమాణాలు తెలుసుకుందాం…

 

Which Shiva Linga should be worshiped

మట్టి, భస్మం, ఆవుపేడ, పిండి,రాగి, కంచు వీనిలో దేనితోనైనా లింగం చేయించి ఒకసారి పూజించిన దేవలోకమున పదివేల కల్పములు నివసిస్తారని శాస్త్ర ప్రవచనం. కట్టతో చేసిన శివలింగాన్ని అర్చిస్తే ధనం వస్తుంది. స్పటికలింగాన్ని అర్చిస్తే అన్ని కోర్కెలను తీరుస్తుంది. రత్నం, పాదరస, వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, రాయి తదితర శివలింగాలను అర్చిస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి.

రాతితో చేసిన శివలింగం అయితే నాలుగు అంగుళాలు మించరాదు. దానికన్నా పెద్దదాన్ని పూజించరాదు. పార్థివ లింగాన్ని పూజించిన (పుట్ట మట్టితో అప్పుటికప్పుడు చేసిన లింగం) ఆయుష్మంతుడు, ఇష్టమైన వరములను పొందుతాడు. శ్రీమంతుడు, పుత్రవంతుడు, ధనవంతుడు, సుఖి అవుతాడు. ఇక ఆలస్యమెందుకు శుచితో, శుభ్రతతో నిత్యం శివార్చన చేసుకోండి. ఆయురారోగ్యాలను పొందండి.

– కేశవ