బుల్లితెర స్టార్ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో నటిగా పరిచయమై ఆ తర్వాత యాంకర్ గా దూసుకు పోతోంది అనసూయ. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది అనసూయ. పుష్ప, ఖిలాడీ హిట్ మూవీల్లో ఈ మధ్య నటించి… తన క్రేజ్ మరింత పెంచుకుంది.
సినిమాలతో… పాటు ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ.. సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే.. ఇది ఇలా ఉండగా.. తాజాగా యాంకర్ అనసూయ.. మహిళల దినోత్సవం సంచలన వ్యాఖలు చేసింది.
ఇది ఉమెన్స్ డే కాదని.. ఒక ఫూల్స్ డే అంటూ రచ్చ చేసింది. ఉమెన్స్ డే రోజు మొత్తం… మహిళలను గౌరవిస్తారని.. ఆ తర్వాత మగాళ్లు మృగాలు అవుతారనే ఉద్దేశ్యంలో.. ఈ వ్యాఖ్యలు చేసింది అనుసూయ. అయితే.. యాంకర్ అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలకు అదే రీతిలో నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. మహిళలను అవమానించిందని ఫైర్ అవుతున్నారు.
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022