టైట్ డ్రెస్ లో చెమటలు చిందిస్తున్న అనసూయ.. ఫిదా అవుతున్న అభిమానులు..

-

జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు అనసూయ. తన అందచందాలతో చురుకైన మాటలతో ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్న అనసూయ తాజాగా తన వర్క్ అవుట్ లకు సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాల్ వేదికగా పంచుకున్నారు.. యాంకర్ అనసూయ బుల్లి తెరపై చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. టీవీ షోలు, యాంకరింగ్ తో మంచి పేరు సంపాదించుకొని భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటూ వచ్చారు. ఈమె ఒక షోకు దాదాపు రెండు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్ కూడా ఉంది. యాంకర్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బుల్లి తెరకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెంచేశారు..

Anasuya ఇండస్ట్రీలో అంత మంది ఉంటే ..ఎందుకు అందరు అనసూయనే ఆంటీ అంటున్నారో  తెలుసా..?

ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా వీటితోపాటు వెబ్ సిరీస్లో సైతం నటిస్తున్నారు.. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు అభిమానులతో అందుబాటులో ఉంటూ వస్తున్న అనసూయ తాజాగా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఒక వీడియోను ఇన్స్టా స్టేటస్ లో పంచుకోగా వైరల్ గా మారింది. ఇది చూసిన ఆమె అభిమానులంతా లైక్స్, కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.. ఈ వీడియోలో టైట్ డ్రెస్ వేసుకొని జిమ్ లో చెమటలు చిందిస్తూ కనిపించారు అనసూయ. ప్రస్తుతం అనసూయ 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తరగని అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ వస్తున్నారు. యాంకర్ గా ఉన్నప్పుడే అందాలు ఆరబోయటంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ భామ.. సినిమాల్లో నటిస్తున్నప్పుడు మరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం ఇందులో దూసుకుపోవాలంటే చెమటలు చిందించక తప్పదని డిసైడ్ అయిపోయినట్టున్నారు అనసూయ. అందుకే తెగ వర్క్ అవుట్ లు చేస్తూ వస్తున్నారు.

 

కాగా ఇప్పటికే అనసూయ ఒక మలయాళీ చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈమె చేతిలో మరో మలయాళీ సినిమా ఉందని వీటితోపాటు రెండు తమిళ చిత్రాల్లో కూడా అనసూయ నటిస్తుందని సమాచారం. అలాగే తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 లో దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ లో కూడా అనసూయ నటిస్తుంది..

కాగా ప్రస్తుతం అనసూయ కన్యాశుల్కమనే వెబ్ సిరీస్ లో నటిస్తుందని తెలుస్తోంది. ఇందులో వేశ్య మధురవాణి పాత్రలో నటిస్తుందని.. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం.. ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడని.. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news