టాలెంట్ ఎవరి సొత్తు కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సత్తా ఉన్న వాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే టీ హబ్- వీ-హబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు అందించేలా హైదరాబాద్ లో మరో హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్- టి వర్క్స్‌ను రేపు సాయంత్రం ప్రారంభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీన్ని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్‌లీవ్ ప్రారంభిస్తారని చెప్పారు. యువతకు మేలు చేసే ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పామని వెల్లడించారు. అక్కడ వందల వేల స్టార్టప్‌లు పనిచేస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు టీ -వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేటీఆర్ వివరించారు. టీ వర్క్స్‌కి పాఠశాల విద్యార్థులను తీసుకురావడం సహా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లలో శాటిలైట్ సెంటర్స్ పెడతామని కేటీఆర్ చెప్పారు.