దివంగత సీనియర్ నటి మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె తమిళ సినీ నటి వనితా విజయ్ కుమార్ ఈరోజు చెన్నైలో విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ని మూడో పెళ్లి చేసుకున్నారు. లాక్డౌన్ ఆదేశాల ప్రకారం అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.
క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక జరిగింది. కాగా, 1999లో ‘దేవి’ సినిమాతో వనిత తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆమె మొదట 2000 సంవత్సరంలో తమిళ టీవీ నటుడు ఆకాష్‌ను పెళ్లాడగా.. వీరికి ఓ బాబు, పాప కలిగారు. అయితే వారి వివాహ బంధం ఏడేళ్లు కూడా నిలవలేకపోయింది.
2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకున్న వనిత అదే సంవత్సరంలో ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప సంతానం. కొంత కాలానికి అతనితో కూడా మనస్పర్దలు వచ్చి విడిపోయారు. కొన్నాళ్ల పాటు కొరియోగ్రాఫర్ పీటర్‌తో సహజీవనం చేసిన ఆమె తాజాగా మూడో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.