సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనలో భాగంగా రామకుప్పం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలు తెలుగుదేశం పార్టీయే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నాకు వయసు ఓ నంబర్ అని నా ఆలోచనలు పదిహేను సంవత్సరాల యువకుడిలా ఉంటాయి. వచ్చే 20 సంవత్సరాలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాను. కుప్పంలో లక్ష్య ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అన్నారు. హంద్రీనీవాలో నీళ్లకు బదులు అవినీతి పారిస్తున్నారు. ప్రజలందరూ రోడ్డున పడితే ,సీఎం మాత్రం ప్యాలెస్ లో ఉన్నారు. వాటాలు అడుగుతున్న కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సరిగా రావడం లేదు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు జగన్ కి అర్ధం అయ్యే ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. వారి దాడులకు నేను భయపడను. మీరు తిన్నది బయటకి కక్కిస్తాను. జగన్.. సామాజిక న్యాయం చేయలేదని వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీర నెయ్యి చందం. జగన్ ప్రభుత్వంలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు సజ్జల,పెద్దిరెడ్డి, విజయసాయి రెడ్డి,సుబ్బారెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే అని అన్నారు.గాడి తప్పిన పాలనను మళ్లీ సరి చేయటమే తన కోరిక అని చంద్రబాబు నాయుడు అన్నారు.