ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత బహిరంగ సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
రేపు పెన్షన్ల పెంపు పై కార్యక్రమంలో సీఎం జగన్.. 2,750 రూపాయల నుంచి 3000 రూపాయలకు పింఛన్లు పెంచనున్నారు. కాగా.. ప్రభుత్వం ఏటా 66.34 లక్షల మందికి పింఛన్లు అందిస్తుంది. పెన్షన్ల పై ప్రతి సంవత్సరం వ్యయం రూ.23,556 కోట్లు చేయనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పింఛన్లు ద్వారా అందించిన మొత్తం సుమారు 83,526 కోట్లు.