ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఆ రోజు ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఆగస్టు 17 సాయంత్రానికల్లా ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు చెందిన ప్రతిపాదనల్ని పంపాల్సిందిగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.మూడు రాజధానుల దిశగా తీసుకునే చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలనున్నాయి. మరోవైపు సీఆర్డీఏ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం.
మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వివరించారు. పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా… కొవిడ్ వల్ల ప్రత్యక్ష విచారణకు హాజరుకాలేమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల గడువు ఇవాళ్టితో ముగుస్తుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. స్టేటస్‌కో ఉత్తర్వులు ఈనెల 27వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.