వరద బాధితులకు జగన్‌ శుభవార్త… వారందరికీ కొత్త ఇండ్లు మంజూరు

వరద బాధితులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. పూర్తిగా దెబ్బ తిన్నవారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు సీఎం జగన్‌. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని… వచ్చే 3,4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలని ఆదేశించారు.

jagan
jagan

పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని… వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరుచేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. 2017 లో అన్నమయ్య ప్రాజెక్టు నివేదికను పట్టించుకోలేదని… గతంలో అన్నమయ్య ప్రాజెక్టు పై నివేదికలను పట్టించుకోలేదన్నారు.

చెయ్యేరు ప్రాంతంలో గతంలో ఉన్నడూలేని విధంగా వరద వచ్చిందని… పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నీటి విడుదల సామర్థ్యానికి మించి వరదనీరు వచ్చిందని వెల్లడించారు. అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్‌ చేయాలి… కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయగలిగే విధంగా అప్పుడు డిజైన్‌ చేశారని వెల్లడించారు.