నా తల్లిపై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే రాజధాని బిల్లు వెనక్కి- నారా లోకేష్

తన తల్లిపై అనుచితంగా చేసిన వ్యాఖ్యల నుంచి జనం చూపు మరల్చాడానికే మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ వెనక్కి తీసుకున్నట్లు నారాలోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఏ సబ్జెక్ట్ పై అవగాహన లేదని అన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అవగాహన ఉన్న వ్యక్తి ఏదైనా ఒక చట్టం తీసుకువస్తే దాని వల్ల లాభాలేంటి.. నష్టాలేంటని ముందుగా తెలుసుకోవాలి. ఎక్కడో సౌతాఫ్రికాలో జరిగిందని ఏపీలో కూడా మూడు ముక్కల రాజధానిని తీసుకువచ్చారని విమర్శించారు. దీని వల్ల విశాఖ, కర్నూలు ఏమాత్రం అభివ్రుద్ది చెందలేదని ఆయన అన్నారు. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నారు.

ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును హడావుడిగా వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న ప్రభుత్వం కొత్త బిల్లులను తీసుకురావచ్చు కదా..అని ప్రశ్నించారు. శాసన సభలో తన తల్లిని అవమానించిన విధానం ప్రజలంతా తెలుసుకుంటున్నారునే ఆలోచనతోనే మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకుంటున్నారు తప్ప జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని నారా లోకేష్ అన్నారు.