సీఎం జగన్ పై కుట్రతోనే దాడి చేశారు : మంత్రి బొత్స

-

ఏపీ సీఎం జగన్ పై  రాళ్ల దాడి అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక షార్ప్ షూటర్ కొట్టినట్లుగా జగన్ పై దాడి జరిగిందన్నారు. అలాంటి వారిని చంద్రబాబు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. జగన్ పై దాడి డ్రామా కాదని.. దాడికి ముందు రోజే చంద్రబాబు భాష అందరూ చూశారన్నారు. చంద్రబాబు భాషను ఖండిస్తున్నామన్నారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీ మద్దతిస్తుందా.. వ్యతిరేకిస్తుందా చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

అది చెప్పే విశాఖలో బీజేపీ పోటీ చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం అని బొత్స తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. అది చెప్పిన తర్వాత విశాఖలో ఎన్డీఏ నాయకులు పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏపీ  సీఎం జగన్ పై కుట్రతోనే రాయితో దాడి చేశారని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news