మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఆయన జిల్లాలోని పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రమణ 2004-2009 కాలం లో పత్తి పాడు ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆ తరువాత ఆ సెగ్మెంట్ ఎస్సీ లకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఆయనకు నియోజకవర్గం లేకుండా పోయింది.ఇంతలో వైసీపీ ఆవిర్భవించడంతో ఆ పార్టీ లో చేరి పొన్నూరు ఇంఛార్జి గా ఉంటూ 2014 లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వరకు పొన్నూరుకు ఆయనే వైసీపీ ఇంచార్జి గా ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.
చివరి నిమిషంలో కిలార్ రోశయ్య కు పార్టీ టికెట్ ఇచ్చింది. అయినా రమణ రోశయ్య విజయానికి సహకరించారు.ఆ తర్వాత రోశయ్య కు రమణ కు దూరం పెరిగింది. రమణ వర్గానికి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అవమానాలు పెరిగాయి. చివరకు రమణ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు వచ్చింది. అప్పటి నుంచి రమణ రాజకీయాల్లో ఉన్నా మౌనంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఆయన పై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. రమణ కు పొన్నూరు తో పాటు, పత్తిపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల లో బంధుత్వాలు, అనుచరులు ఉన్నారు. పై గా రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టిన రోశయ్య వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.