ప్రతీ ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగన్ రావాలి : జగన్

-

ప్రతీ ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగన్ రావాలి అన్నారు సీఎం జగన్. ప్రొద్దుటూరులో నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగ సభలో మాట్లాడారు.  పేదల భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి. మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు..ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడాలన్నా.. మళ్లీ జగన్ ను గెలిపించండి. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం ఉంటుంది. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి.

చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు అన్నారు.  చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడి యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు. అధికారం కోసం చంద్రబాబు అందరి కాళ్లు పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news