ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది : ప్రధాని మోడీ

-

రాజమహేంద్రవరం వేమగిరి కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని తెలుగులో మాట్లాడారు. గోదారమ్మకి వందనాలు. ఈ నేలపై ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇప్పుడు ఈ నేలపై చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు.

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుందని  ప్రధాని మోడీ పేర్కొన్నారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు ప్రధాని. అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే ఏపీ అభివృద్ధిలో ముందుంది.   వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుంది.

 

ఏపీ ప్రజలు ఐదేళ్లు వైసీపీకి అధికారం ఇచ్చారు. ఈసారి ఎన్డీఏకు ఇవ్వనున్నారు. ఏపీలో యువత ఎక్కువగా ఉంది. టెక్నాలజీలో ఏపీ వారు ముందుంటారు. ఏపీలో మీ ఓటు ద్వారా మే 13న సరికొత్త అద్యయానాన్ని లిఖించనున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ వంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే పనులు వేగవంతంగా కొనసాగుతాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో భారత్ అభివృద్ధిలో వెనకడుగు వేసిందన్నారు. కాంగ్రెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్ లే జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news