ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా… జగన్ సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తగ్గింది అనుకున్న కరోనా చుక్కలు చూపిస్తుంది. 300 మార్క్ దాటాయి కరోనా కేసులు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కలవరం మొదలయింది. జగన్ సర్కార్ ఎక్కడిక్కడ జాగ్రత్తగా చర్యలు తీసుకుని ముందుకి వెళ్తుంది. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో కరోనా విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ జగన్ సర్కార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌-19 బాధితులను ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 15 రకాల వైద్య చికిత్స విధానాలను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేరుస్తూ ఆదేశాలు ఇచ్చింది.

కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి కరోనా వైద్య చికిత్సకు ధరల ప్యాకేజీ నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కనీసంగా రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.16లక్షల వరకు కరోనా చికిత్స ఫీజులను నిర్ణయించారు. కరోనా కేసులను ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది అనే నిబంధన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు ఎప్పటికప్పుడు చికిత్సను పర్యవేక్షిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news