అమెరికాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు లక్షల మందికి కరోనా వైరస్ సోకింది అమెరికాలో. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికాలో మరణాలు కూడా రోజు రొజుకి పెరుగుతున్నాయి. అదుపులో ఉంది అనుకున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారడం తో ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల సాయం కోరుతున్నారు.
ఈ నేపధ్యంలోనే మన దేశ సాయం కూడా ఆయన కోరిన సంగతి తెలిసిందే. మలేరియా కు వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఆదివారం ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేసారు. కాని ఎగుమతులపై మోడీ నిషేధం విధించారు. భారత్ లో కరోనా కట్టడికి ఇది ఉపయోగపడుతుంది అని ట్రంప్ భావించారు. అందుకే ఈ మందు తమకు కూడా కావాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు వార్తలు వచ్చాయి. కాని దీనిపై మోడీ నిరాకరించారు.
తమకే దీనితో అవసరం ఉందని తాము దీన్ని ఇవ్వలేమని ఆయన పరోక్ష౦గా చెప్పడం తో ట్రంప్ ఇప్పుడు రంగంలోకి దిగి భారత్ మీద కక్ష తీర్చుకోవడానికి సిద్దమయ్యారు. భారత్-ఆమెరికా మధ్య చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి… భారత్‌ను ఇబ్బంది పెట్టాలని, ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నారట. హెచ్1 బీ వీసాలను రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు.