రాజులు మించిన ఆస్తులను సంపాదిస్తూ.. ప్యాలెస్ లు కడుతున్నాడు – జగన్ పై ఏపీ సర్పంచుల ఆగ్రహం

-

నయా రాజకీయంతో, క్రోని క్యాప్టిలిజంతో వైసీపీ పాలన సాగుతుంది.. శతాబ్దాల తరబడి విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వంశం పూసపాటి వంశీయులుదన్నారు ఆంద్రప్రదేశ్ సర్పంచ్,ఎంపిటిసి ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్. వేల కోట్లు ఆస్తులను ప్రజలకు దారపోసిన ఘనత పూసపాటి వంశీయులుదని.. రాజులు మించిన ఆస్తులను సంపాదిస్తు జగన్మోహన్ రెడ్డి…అనేక ప్యాలెస్ లు కడుతున్నాడని మండిపడ్డారు ఆంద్రప్రదేశ్ సర్పంచ్,ఎంపిటిసి ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్.

బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, చివరకు పక్కనే ఉన్న విశాఖలోని ఋషి కొండ ను కూడా తవ్వేసి ప్యాలెస్ లు కడుతున్నాడని.. సర్పంచ్ లకు నిధులు, విధులు, భాద్యతలు లేవు అంటే అది ఒక్క సర్పంచ్ కే నష్టం కాదని తెలిపారు. యావత్తు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని.. నిధులు లేకపోవడంతో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారని అగ్రహించారు.

గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 14, 15 వ ఆర్ధిక సంఘానికి సంబంధించి రూ.7600 కోట్ల లను జగన్మోహన్ రెడ్డి దోచేసాడు.. పంచాయతీ లను నిర్వీర్యం చేస్తూ సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా చేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ అకౌంట్స్ ని జీరో ఆకౌంట్స్ గా మార్చేశారు.. గత 18 వ తేదీన సర్పంచ్ లకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న రూ.7600 కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆంద్రప్రదేశ్ సర్పంచ్,ఎంపిటిసి ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news