ఏపీ లో కొత్త గా 183 క‌రోనా కేసులు ఒక‌రు మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో కొత్త‌గా 183 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే ఒకరు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌హమ్మారి బారిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 14,431 కి చేరింది. దీంతో పాటు ఒక రోజు లో 163 మంది కరోనా మ‌హ‌మ్మారి ని జ‌యించి పూర్తి ఆరోగ్యం తో కోలుకున్నారు.

అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ 30, 863 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష లు జ‌రిపారు. అందులో కేవ‌లం 183 మందికే కరోనా పాజిటివ్ అని తెలింది. వీటి తో ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ లో 2,82,14,516 మంది కి కరోనా వైర‌స్ సోకింది. అయితే ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో 2,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ లో క‌రోనా వైర‌స్ సోకి కోలుకున్న వారి సంఖ్య 20,52,494 కు చేరింది. అయితే ఈ మ‌ధ్య కాలం లో వ‌చ్చిన పండుగ‌ల ఎఫెక్ట్ కరోనా వైర‌స్ వ్యాప్తి పై ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేద‌నే చెప్పాలి.