తిరుమల భక్తులకు అలర్ట్..సర్వదర్శనానికి 2 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏకంగా 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అటు 64,277 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 24,340 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లుగా నమోదు అయింది.

కాగా, నేడు నాల్గో రోజు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు, అర్చకులు.

అటు రేపు శ్రీవారి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. మాడవీధులలోని గ్యాలరిల ద్వారా 2 లక్షల మంది భక్తులు వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు చేసారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news