మహా శివరాత్రి స్పెషల్‌ : ఛార్జీలు లేకుండా 3,225 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

-

విజయవాడ : మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేసింది ఏపీ ఆర్టీసీ. 96 శైవ క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి 3,225 బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. గుంటూరు జిల్లా కోటప్ప కొండకు పలు ప్రాంతాల నుంచి 410 బస్సులు ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లా శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి 390 బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ…. కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన క్షేత్రాలకు కూడా బస్సులు ఏర్పాటు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా బలివె, పట్టిసీమ తదితర శైవ క్షైత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి చార్జీల పెంపు ఉండదని.. ఘాట్ రోడ్డు పై వెళ్లేందుకు ఫిట్ నెస్ కల్గిన బస్సులు ,తర్ఫీదు పొందిన డ్రైవర్లు ఏర్పాటు చేశామని.. ఆర్టీసీ ఎండీ ప్రకటన చేశారు.

బస్టాండ్లలో తాగునీరు సహా మౌలిక వసతులు ఏర్పాటు చేశామని… కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను శానిటైజ్ చేస్తున్నామని – ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు అదనపు బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని.. సమూహంగా వెళ్లే భక్తులు ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదిస్తే బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news