రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. రష్యా ఏక పక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. మొన్న ఉదయమే మొదలైన యుద్ధం… ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనులు కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యాని నిలరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి రష్యాను యుద్ధం ఆపేయాలని కోరింది.
అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు శాపంగా మారింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ అలాగే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక మన దేశంలో వీటిపై ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మన తెలంగాణ విషయానికి వస్తే చాలా చోట్ల పెట్రోల్ రేట్ లతోపాటు, బంగారం ధరలు కూడా నిన్న విపరీతంగా పెరిగిపోయాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో బంగారం, వెండి ధరలు ఎలా పెరిగాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే…నిన్న పెరిగిన ధరలు ఇవాళ మాత్రం తగ్గిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి రూ. 51,110 కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 46,850 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.2700 తగ్గి రూ. 70,000 గా నమోదు అయింది.