ఏపీలో కొత్త‌గా 547 క‌రోనా కేసులు.. ఒక‌రు మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల‌లో కొత్త‌గా 547 క‌రోనా కేసులు వెలుగు చూశాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నేటి కరోనా బులిటిన్ ను విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం ఈ రోజు కేసుల తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల 20,78,923 కి చేరాయని వెల్ల‌డించారు.. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బారీన ప‌డి విశాఖ పట్నంలో ఒక‌రు మృతి చెందారు.

ap-corona
ap-corona

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కాటు కు బ‌లైన వారి సంఖ్య 14,500 కు చేరింది. అలాగే ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ 128 క‌రోనా మ‌హ‌మ్మారి జయించారు. అలాగే రాష్ట్రంలో ఇంకా 2266 క‌రోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌డిచిన 24 గంట‌ల‌లో 33,339 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 3,14,92,070 సాంపిల్స్ ను ప‌రీక్షించారు. కాగ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజు రోజు కు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని వైద్యులు సూచించారు.