రాష్ట్రాలకు కేంద్రం మరో షాక్‌..ఇకపై జాతీయ ప్రాజెక్టుకూ 60 శాతం నిధులే

-

కేంద్ర ప్రభుత్వం… జీఎస్టీ, పెట్రోల్ పై టాక్స్ తదితర కారణాలతో… రాష్ట్రాలకు నష్టం చేకూరేలా వ్యవహరిస్తోంది. దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాలు కేంద్రం పై పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిన కేంద్రం నుంచి 60 శాతం నిధులు మాత్రమే వస్తాయని మరో బాంబు పేల్చింది. మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాల భరించాల్సి ఉంటుందని తెలిపింది.

దీంతోపాటు నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయి. ఇలా పలు నిబంధనలతో జాతీయ ప్రాజెక్టులకు, సత్వర సాగునీటి ప్రయోజనం, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ప్రాజెక్టులు గుర్తింపు మరియు నిధుల విడుదలకు సంబంధించి జల్శక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది.

ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పంపింది. ఈ లెక్కన జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులకు 60 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. అంటే పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే నిధులు చెల్లించని ఉందన్నమాట.ఇక అటు 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news