జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. గుంటూరులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఇటీవలే ఏపీ వాలింటీర్లపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు.

జూలై 9 న వారాహి యాత్రలో ఏలూరు సభ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. తాడికొండ మండలం కంతెరు కి చెందిన వాలంటీర్ పవన్ కుమార్ తో పాటు మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలోనే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. ఇక పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని ఈ సందర్భంగా గుంటూరు న్యాయస్థానం ఆదేశించింది.