మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త చట్టాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అమ్మాయిలకు ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం కొత్త చర్యలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయినా కామాంధులలో ఎటువంటి మార్పులు రాలేదు. వరుసగా లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరో దారున ఘటన వెలుగు చూసింది. కృష్ణా జిల్లా మచిలిపట్నం లోని ఆదర్శనగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

17 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు మంతిరి నారాయణ,అతని స్నేహితుడు. అత్యాచారం చేస్తూ వీడియో చిత్రీకరించారు నిందితులు. అత్యాచారం చేసినట్టు ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాలికను బెదిరించారు యువకులు. నిందితుల వివరాలను తెలుసుకుని తన అన్నకు చెప్పింది బాలిక. దీంతో తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక. నిందితుల పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు బాలిక తల్లిదండ్రులు. ఫొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.