కువైట్ నుంచి ఏపీకి క్షేమంగా రాయచోటి మహిళ చేరుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చింది ఏపీ సర్కార్.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్…ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తరుణంలోనే.. 24 గంటల్లోనే కువైట్ నుంచి ఏపీకి క్షేమంగా రాయచోటి మహిళ చేరుకుంది. గత రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా బయలుదేరిన కవిత ఈరోజు ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఏపీకి చేరుకున్నారు కవిత.