పల్నాడు టీడీపీ పార్టీలో ముసలం నెలకొంది. పల్నాడులోని నరసరావుపేటలో తెలుగు తమ్ముళ్ల వివాదం ముదురుతోంది. తాజాగా నరసరావుపేట రొంపిచర్ల మండలం లో విభేదాలు భగ్గుమన్నాయి. చౌక దుకాణం పంచాయితీ వ్యవహారంలో ఎమ్మెల్యే అరవింద బాబు సమక్షంలో తెలుగు తమ్ముళ్ల మధ్య బాహబాహి చోటు చేసుకుంది.

టిడిపి మండల శాఖ అధ్యక్షుడు పై ఎంఎల్ఏ సమక్షంలో దాడి చేసింది ప్రత్యర్థి వర్గం. దీంతో అక్కడి నుంచి వెంటనే ఎమ్మెల్యే అరవింద బాబు వెళ్ళిపోయారు. ఇక తర్వాత కూడా ఇరువర్గాల పరస్పర దాడి జరిగింది. ఇరు వర్గాలు.. రాళ్లు రువ్వుకున్నాయి.