ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు వాలంటీర్ ఉద్యోగం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్లను విధుల్లోంచి తొలగించారు. వాలంటీర్ల వల్ల అధికార పార్టీకి ఎక్కువగా లాభపడే అవకాశముందని.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో వాలంటీర్లు తలదూర్చకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే వాలంటీర్ కి రాజీనామా చేసిన మహిళా దొంగగా మారింది.
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. స్వాతి అనే వాలంటీర్ వృద్ధురాలి నోటిలో గుడ్డలు కుక్కి బంగారాన్ని దోచుకెళ్లింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగడ గ్రామానికి చెందిన స్వాతి వాలంటీర్’గా పని చేసి ఎన్నికల ముందు రాజీనామా చేసింది. తనకు చేసేందుకు పని లేకపోవడంతో దొంగగా మారినట్టు తెలుస్తోంది.