ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును, సిమెంట్ లోడ్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వేలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలిలో జేసీబీ సాయంతో ఆర్టీసీ బస్సును,లారీని పక్కకు తీసి కడప-రాయచోటి మధ్య నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని పొలీసులు నిర్దారణకు వచ్చారు. దీనికి తోడు అతివేగం కూడా కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.కాగా, డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతివేగం ప్రమాదకరమని సూచించారు. తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.