కన్ ఫాం: అచ్చెన్నంటే బీసీ.. బీసీ అంటే అచ్చెన్న!

-

టీడీపీలో బీసీలకు పెద్దపీట వేస్తారు.. టీడీపీకి ఉన్న బలం అంతా బీసీలే.. ఇది ఒకప్పుడు టీడీపీకి బీసీలకు ఉన్న సంబంధం! అది కాస్తా తగ్గుముఖం పట్టి చివరిదశకు వచ్చేసిన సంగతి తెలిసిందే! అయితే ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని టీడీపీ ఏపీ అధ్యక్షుడిని చేయడాన్ని… బీఇసీలకు వేసిన పెద్ద పీటగా చెప్పుకొస్తున్నారు అచ్చెన్నాయుడు! మరి ఆరోవేలు అయిన పదవి ఇస్తేనే బీసీలకు పెద్దపీట అయితే.. మరి జగన్ చేస్తున్నదాన్నేమనాలి? ఇప్పుడు చూద్దాం…!!

అధికారంలో ఉన్నప్పుడు కొండపై ఉంటున్న బీసీలు వచ్చి జీతాలు / కమిషన్ లు పెంచమని అడిగితే… తమాషాలు చేస్తున్నారా.. తోకలు కత్తిరిస్తా అని కేకలు వేసిన చంద్రబాబుని బీసీలు మరిచిపోయారనుకుందామా? ఆ సంగతి అలా ఉంటే… జగన్ బీసీలకు పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే! జగన్ ప్రభుత్వం సంచలనమైన రీతిలో బీసీ వర్గంలోని వివిధ కులాల వారికోసం 56 కార్పొరేషన్‌లు పెట్టి, పదవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సుమారు 700 మందికి పైగా పదవులు వచ్చాయి! అదేమీ పెద్ద విషయం కాదంట!

జగన్ తన మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేయడం, నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు ఆ వర్గాలకే కేటాయించడం ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకుంటున్నారన్నది తెలిసిన విషయమే! అది కూడా బీసీలకు ఏదో చేసినట్లు కాదంట. ప్రస్తుతం ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు అచ్చెన్నా చెబుతున్న మాటలు ఇవి! జగన్ ఇస్తున్న కార్పొరేషన్ పదవులకు, బీసీలకు చేస్తున్నవాటికీ పెద్ద విలువ ఏమి ఉంటుంది అని ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడు… తన ఒక్కడికి ఆరువేలైన పార్టీ పదవి ఇస్తే, బీసీలు అందరికి ప్రయోజనం జరిగినట్లు చెప్పడాన్ని ఏమనుకోవాలి? ఎలా అర్ధం చేసుకోవాలి? అచ్చెన్నకే తెలియాలి!

Read more RELATED
Recommended to you

Latest news