గుడివాడ టిడ్కో ప్లాట్లను సీఎం జగన్‌ త్వరలో ప్రారంభిస్తారు – మంత్రి ఆదిమూలపు

-

గుడివాడ టిడ్కో ప్లాట్లను సీఎం జగన్‌ త్వరలో ప్రారంభిస్తారన్నారు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇవాళ గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్ లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, ప్రతిపక్షాలకు ఛాలెంజ్ చేశారు.

టిడ్కో నిర్మాణాలపై టిడిపి నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు….నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లను టిడిపి హయాంలో ప్రారంభించారని ఆగ్రహించారు. టిడిపి నేతలు ప్రారంభించిన ఇళ్ళలో ఒకరైన నివాసం ఉంటున్నారా?14వేల కోట్ల అదనపు ఖర్చుతో లే అవుట్ల అభివృద్ధి…అన్నారు. ప్రజలు నేరుగా వచ్చినివాసముండేలా 50వేల టిడ్కో ఫ్లాట్లను 100శాతం నిర్మించామని.. వైసిపి హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు..అని వివరించారు. జగన్ ఇస్తున్న ఇళ్లకు…. పదేపదే టిడిపి నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదు…పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news