యూకే పర్యటనకు మంత్రి కేటీఆర్..13వ తేదీ వరకు అక్కడే

-

యూకే పర్యటనకు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఉదయం యుకేకు బయలుదేరిన మంత్రి కేటీఆర్ 13వ తేదీ వరకు తన పర్యటనను కొనసాగిస్తారు.

ఇక మంత్రి కేటీఆర్‌ తో సహా ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా యూకేకు బయలు దేరి వెళ్లారు. కాగా, తెలంగాణలో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, తెలంగాణ సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టడం పట్ల యూకే పార్లమెంట్ కమిటీ హాల్‌లో కెసిఆర్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ప్రవాస భారతీయులు. ఈ సభకు బ్రిటన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, నవేదు మిశ్ర, బారోన్ కుల్దీప్ సింగ్ సహోట మరియు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news