కౌంటింగ్ ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్టింగ్ చేస్తామని పేర్కొన్నారు ఏపీ పోలీసులు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టు ప్రక్కల మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని.. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని… గొడవలు విద్వేషాలు అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
జిల్లా అంతట లైవ్ స్ట్రీమింగ్ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టామని… ఎన్నికల సంఘం బాణసంచా విక్రయాలు, తయారీ మరియు కాల్చడం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నిషేధించడం జరిగిందన్నారు. పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గాని, నిషేధిత వస్తువులు గాని కౌంటింగ్ సెంటర్ల వద్దకు తీసుకొని రాకూడదు..కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్టింగ్ చేస్తామని వివరించారు. ఏజెంట్లు మధ్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి నిరాకరణ చేస్తున్నామన్నారు.
.