తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమలలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఉంది. ఈ తరుణంలోనే ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ… ఈ మేరకు ప్రకటన చేసింది. ఇక అటు దీపావళి ఎఫెక్ట్..తిరుమలలో భారీగా రద్దీ స్పష్టం గా కనిపిస్తోంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలోనే నిన్న ఒక్కరోజున తిరుమల శ్రీవారిని 55 వేల 219 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే నిన్న ఒక్కరోజు… 16, 211 మంది…. తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం… నిన్న ఒక్కరోజున 4.37 కోట్లుగా నమోదు అయింది. ఇక దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో విపరీతంగా భక్తులు… ఈ వారం రోజుల పాటు ఉంటారని టీటీడీ అధికారులు చెబుతున్నారు.