తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో తిరుమల శ్రీవారి భక్తులతో నిండిపోయింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక 74,884 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 32,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.7 కోట్లుగా నమోదు అయింది.
ఇక అటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఏడోవ రోజు. ఏడో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా…. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల స్వామివారు. ఏడో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా…. తిరుమలలో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఇక ఎల్లుండితో ముగియనున్నాయి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.