హైకోర్టులో చంద్రబాబు మరోసారి క్వాష్ పిటిషన్ చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన సీఐడీ కస్టడీ ఉత్తర్వులను కొట్టేయండని.. అప్పటి వరకు ఏసీబీ కోర్టులో తదుపరి చర్యలన్నీ నిలిపేయండని…ఇవే అభ్యర్థనలతో మొన్న వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి. ఈ తరుణంలోనే… శనివారం ఆయన సెలవులో ఉండటంతో అదే అభ్యర్థనతో మరో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. ఈ విషయాన్ని జస్టిస్ సురేష్‌రెడ్డి ముందు ప్రస్తావించారు చంద్రబాబు న్యాయవాది.
ఇక లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణ సాధ్యం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పారట. సాధారణ పద్ధతిలో విచారిస్తామని స్పష్టం చేశారు జస్టిస్ సురేష్‌రెడ్డి. కాగా… తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్, పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరు పరచనున్నారు అధికారులు. ఏసీబీ కోర్టు నుంచే తర్వాతి ప్రక్రియ జరగనుంది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై నేటి సాయంత్రమే నిర్ణయం తీసుకోనున్నారు ఏసీబీ జడ్జి. దీంతో తెలుగు దేశం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.