మిగిలిన 12 జిల్లాల సంగతి పక్కనపెట్టండి.. ముందు మా 29గ్రామాల పంతాన్ని పట్టించుకోండి.. రాజధాని మాకుమాత్రమే సొంతం.. ఏపీకి రాజధాని అంటూ ఉంటే అది కేవలం అమరావతిలోనే ఉండాలంటూ గత కొన్ని రోజులుగా కొంతమంది రైతులు, మహిళలు అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ పోరాటం ప్రతీ నియోజకవర్గంలోనూ స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు అమరావతి మహిళా ఐకాసా నేతలు! ఇది ప్రాక్టికల్ గా సాధ్యమా లేక చంద్రబాబు తర్వాత రాజధాని రైతులను మరింత మోసం చేయడానికి వీరు రెడీ అయ్యారా అనేది ఇప్పుడు చూద్దాం!
కేవలం అమరావతిలోనే మూడు రాజధానూలూ ఉండాలనేది 29గ్రామాలలోని రాజధానికి భూములిచ్చిన రైతుల కోరిక! ఆ అమరావతి ప్రాంతంలో భూములు కొనుక్కున్నవారి కోరిక! రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోరిక! వీటన్నింటిలోనూ భాగస్వాయమున్నది వైకాపా నాయకులు చెబుతున్న టీడీపీ నేతల కోరిక! కానీ… జగన్ కోరిక, జనం కోరిక వేరు! మూడు ప్రాంతాలు అభివృద్ధి దిశగా మరింత వేగంగా అడుగులు వేయాలంటే పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరగాలనేది జగన్ కోరిక!
రాయలసీమలో హైకోర్టు పెట్టాలనేది నేటి డిమాండ్ కాదు! విశాఖ కు రాజధాని అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయన్నది ఇప్పటి మాట కాదు! విజయ్వాడ గుంటూరు మద్య రాజధాని ఉండాలనే డిమాండ్ కూడా ఉంది! ఈ క్రమంలో… జగన్ మూడుప్రాంతాల అభివృద్ధిని, జనం ఆలోచనలనూ అర్ధం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో… కేవ్లం అమరావతిలోనే ఏపీకి రాజధాని ఉండాలి.. రాయలసీమకు ఏమీ వద్దు – ఉత్తరాంధ్రకు అసలే వద్దు.. ఉన్నదంతా అమరావతికే ఇవ్వాలని అంటున్నారు ఐకాసా నేతలు!
ఇక్కడ పెద్ద విచిత్రం ఏమిటంటే… ఉత్తరాంధకు పరిపాలనా రాజధాని వద్దని ఉత్తరాంధ్రలోని ప్రతీ నియోజకవర్గంలో “అమరావతి ఉద్యమాన్ని” తివ్రతరం చేస్తామని ప్రకటిస్తున్నారు అమరావతి మహిళా ఐకాసా నాయకులు! ఇదే క్రమంలో సీమలో హైకోర్టు వద్దని కూడానంట! అవును… 29గ్రామాల్లో జరుగుతున్న అమరావతి ఉద్యమాన్ని 175 నియోజకవర్గాల్లో ఉద్ధృతం చేస్తామని.. ప్రకటిస్తున్నారు అమరావతి మహిళా ఐకాసా నాయకులు! ఇంతకు మించి రాజధాని రైతులను మోసం చేసే మాట మరొకటి ఉంటుందా అనేది ఇతర ప్రాంత ప్రజల ప్రశ్న!!
-CH Raja