బామ్మర్ది “షో” కెళ్ళిన బాబు – చంద్రబాబుకి అంబటి కౌంటర్

-

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 నీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రానున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి బావకు బామ్మర్ది ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ షోలో చాలా సంచలన విషయాలను చంద్రబాబు వెల్లడించనున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీకి షాకిచ్చేలా కామెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు కి కౌంటర్ వేశారు. ” అసెంబ్లీ”ని కాదని బామ్మర్ది “షో”కెళ్ళిన బాబు. జనంలో.. కెళ్లిన జగన్. అందుకే ” 175″ – అన్ స్టాపబుల్ !” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news