వికారాబాద్ లో భారీ వర్షం.. కొడంగల్ చెరువుకట్ట తెగి ఇళ్లలోకి నీరు

-

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకధాటి వాన.. భారీ వరదతో కొడంగల్ పట్టణంలోని పెద్ద చెరువుకున్న పాటు కాలువ తెగింది.

చెరువు కట్ట తెగడంతో కొడంగల్ పట్టణంలోని బాలాజీ నగర్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోని సామగ్రి అంతా నీటిలో తడిసిపోయింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య అని.. ఎప్పుడు కట్ట తెగుతుందోనని భయంతో బతుకుతున్నామని..ఈసారి ఆ భయమే నిజమై తమ ఇళ్లలను చెరువులుగా మార్చేసిందని స్థానికులు వాపోయారు. వెంటనే చెరువు కట్టను బాగు చేసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు.

మరోవైపు ధరూర్ మండలం నాగారం వద్ద వాగులో కారు గల్లంతయింది. వాగు ప్రవాహ వేగాన్ని చూడకుండా దాటించే ప్రయత్నం చేయగా కారు గల్లంతయింది. అందులో ఉన్న ప్రయాణికులు చెట్టుని పట్టుకుని గట్టెక్కారు.

వికారాబాద్ జిల్లా పెద్ద ఉమ్మెంతాల్ లో బుధవారం రోజున 12 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పరిగిలో 10.5 సెంటీమీటర్ల వాన పడినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news