హైదరాబాద్‌ హెరిటేజ్‌లో కరోనా.. చంద్రబాబు క్లారిటీ ఇవ్వండి..

-

పదిమందికి చెప్పే స్థానంలో ఉన్న వ్యక్తిని తాను అని భావించే చంద్రబాబు… తనదగ్గరకు వచ్చే సరికి మాత్రం స్పందించకుండా, తేలు కుట్టిన దొంగలా మిన్నకుండటం ఏమిటనే స్థాయిలో అంబటి రాంబాబు ఫైరవుతున్నారు. ఇంతకూ ఈ విషయం ఏమిటంటే… హైదరాబాద్, ఉప్పల్ లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో పని చేస్తున్న కొందరు ‘కరోనా’ బారిన పడ్డారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన వెలుగులోకి వచ్చిన ఇంత సమయం అవుతున్నా… బాబు స్పందించలేదు! సరిగ్గా ఈ విషయాలపైనే వైసీపీ నేత అంబటి రాంబాబు.. చంద్రబాబుకు కొన్ని డిమాండులు చేస్తున్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హైదరాబాద్‌ ఉప్పల్‌లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా, చాలామందిని క్వారంటైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని మొదలుపెట్టిన అంబటి దీనిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. హెరిటేజ్‌ మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని వేలు, లక్షల మందికి పాలు తీసుకువెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్‌ గా ఉండే ప్రాంతాలలో వైరస్ వచ్చినప్పుడు అది ఇంకా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని… కాబట్టి తక్షణమే బయటకు వచ్చి దీనిలో వాస్తవాలేంటి.. అవాస్తవాలేంటి.. ఏం జరిగింది.. ఎంతమందికి వచ్చింది.. ఎంతమందిని క్వారంటైన్ చేశారనే దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయనాయకుడిగా చంద్రబాబుపై ఉందని అంబటి గుర్తుచేస్తున్నారు.

అయితే… హెరిటేజ్ ఆయన స్వంతసంస్థే… అయినప్పటికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడుకు గుర్తుచేస్తున్నారు అంబటీ. ఎందుకంటే కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సైతం చాలా సలహాలు ఇస్తున్న చంద్రబాబు… హెరిటేజ్‌లో సంభవించిన ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై మరిన్ని ప్రశ్నలు సంధించిన అంబటి… తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపైఇ ఏమి యాక్షన్ తీసుకుంది? హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా? లేక పాల ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయా? వీటన్నింటికి వివరణ ఇవ్వకపోయినట్లైతే… ఆంధ్రరాష్ర్టానికి సంబంధించిన ప్రజలు గానీ, తెలంగాణ రాష్ర్ట ప్రజలు గానీ కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం ఉందని అంబటి చెబుతున్నారు. కాబట్టి దీనిపై తక్షణమే చంద్రబాబు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పితీరాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news