చంద్రబాబు మీద కేసు పెట్టడానికి, ఆయన జైలుకు వెళ్లడానికి, జగన్మోహన్ రెడ్డి కారణం కాదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు పై నమోదైన కేసు 2019కి ముందే నమోదయింది అని ఆయన తెలిపారు. అయితే వైసీపీకి 11 సీట్లు రావడానికి కారణం ఏంటో మీకు తెలుసు. ఆ 11 సీట్లు వెనక 40% ఓట్లు ఉన్నాయని సంగతి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే తెలుసు.
అయితే రాజకీయాల్లో ఎవరికీ లొంగని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్లు, బ్రమింప చేసేది చంద్రబాబు. అదే విధంగా చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ కలసి కుట్ర చేసి జగన్ పై అవాకులు, చవాకులు పేలుతున్నారు. ప్రకాశం బ్యారేజీ పగలగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నారని కేసు పెట్టాలని చూసారు. కానీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి నీ మీరేం చేయలేరు అని అంబటి రాంబాబు స్పష్టం చేసారు.